అనారోగ్య బాధితుడికి ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే
WNP: ఘణపురం మండలం మానాజీపేట గ్రామానికి చెందిన అనారోగ్య బాధితుడు రాజేష్‌కు స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి అండగా నిలిచారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రూ.7 లక్షలు విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్వోసీ)ను మంజూరు చేయించారు. హైదరాబాద్ మాదాపూర్లోని సోమవారం తన కార్యాలయంలో బాధితుడి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ఈ ఎల్వోసీని అందజేసి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.