VIDEO: రోడ్డంతా గుంతలు.. పట్టించుకోని అధికారులు

KNR: మల్కాపూర్ ప్రధాన చౌరస్తా నుంచి చింతకుంట వెళ్లే రహదారి గుంతలమయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతల్లో నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాదచారులు సైతం బురద నీటిలో నడవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇదే ఏరియాలో ప్రముఖ విద్యాసంస్థలు, ఫంక్షన్ హాల్స్ ఉండడంతో విద్యార్థులు, వాహనదారులు పరిస్థితి దయనీయంగా తయారైంది.