వైసీపీ కార్యకర్త మృతిపై మెట్టు గోవిందరెడ్డి దిగ్భ్రాంతి
ATP: డి.హిరేహాల్ మండలం కాదలూరులో గతంలో వాలంటీర్‌గా పనిచేసిన వైసీపీ కార్యకర్త గంగాధర్ రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న ఏపీఐఐసీ మాజీ ఛైర్మన్, నియోజకవర్గ ఇంఛార్జ్ గోవిందరెడ్డి ఆదివారం ఆ గ్రామానికి చేరుకుని గంగాధర కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.