విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: గోపాల్ రావు

ములుగు: జిల్లాలోని ప్రాథమిక వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, వైద్య సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. గోపాలరావు హెచ్చరించారు. బుధవారం జిల్లాలోని ప్రాథమిక వైద్యాధికారులు, ఆరోగ్య, కార్యకర్తలతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. ప్రజల పట్ల సానుకూలంగా ఉండాలని సూచించాడు.