గిద్దలూరులో ఆహార భద్రత అధికారుల తనిఖీలు
ప్రకాశం: గిద్దలూరులో ఆహార భద్రత అధికారి శివతేజ పలు హోటళ్లు, బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, కిరాణా దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా దుకాణదారులు తప్పనిసరిగా ఆహార భద్రత నియమాలు పాటించాలని కోరారు. పరిశుభ్రత, నాణ్యత, గడువు తేదీల పట్ల ప్రత్యేకంగా జాగ్రత్త వహించాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన, శుభ్రమైన ఆహారం అందించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.