ALERT.. రేపు పిడుగులతో కూడిన వర్షం
GNTR: ఉపరితల ఆవర్తనం కారణంగా జిల్లాలో సోమవారం మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. ఉమ్మడి జిల్లాలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. అలానే పలు చోట్ల పిడిగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రైతులు, ప్రజలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.