రేపు సీఎం సహాయనిధి, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

NLG: దేవరకొండలో ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ బుధవారం ఉ.10 గంటలకు ఎమ్మెల్యే నివాసంలో సీఎం సహాయ నిధి, కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఉ. 11 గంటలకు జై భాపూ- జై భీమ్- జై సంవిధాన్ పాదయాత్ర కార్యక్రమంపైన ముఖ్య కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సన్నాహాక సమావేశం, మ. 3 గంటలకు క్యాంప్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.