జొన్నల కొనుగోలు కేంద్రాలు పెంచాలని మంత్రికి వినతి
ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి హైదరాబాద్‌లో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లావ్యాప్తంగా జొన్నలు విస్తారంగా సాగు చేసిన నేపథ్యంలో అంచనాలకు మించి దిగుబడి వచ్చిన సందర్భంగా కొనుగోలు కేంద్రాలను పెంచాలన్నారు. ఎకరాకు 20 క్వింటాళ్ల జొన్నలు కొనుగోలు చేయాలని మంత్రితో కోరారు.