సీఎంకు వినతి పత్రం అందజేసిన జిల్లా ఎమ్మెల్యేలు

సీఎంకు వినతి పత్రం అందజేసిన జిల్లా ఎమ్మెల్యేలు

ATP: అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. ఆర్డీటీ సంస్థకు FCRA రెన్యూవల్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రస్తుతం సేవలు ఆగిపోయే పరిస్థితి ఉందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు వినతి పత్రం అందజేశారు. ఆర్డీటీ సేవలు జిల్లాలో కొనసాగేలా చూస్తామ‌ని సీఎం హామీ ఇచ్చినట్లు నేతలు తెలిపారు.