ఏపీ టీఎస్ఏ జిల్లా జాయింట్ సెక్రటరీగా ప్రసాద్ చంద్ర

ఏపీ టీఎస్ఏ జిల్లా జాయింట్ సెక్రటరీగా ప్రసాద్ చంద్ర

ప్రకాశం: కనిగిరి ఉపఖజానా కార్యాలయంలోని జూనియర్ అకౌంటెంట్‌గా పనిచేయుచున్న కె. ప్రసాద్ చంద్ర ఏపీ టీఎస్ఏ ప్రకాశం జిల్లా జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. బుధవారం ఏపీ ఎన్జీవో అసోసియేషన్ కనిగిరి తాలూకా అధ్యక్షులు పి.వి.రమణారెడ్డి, కార్యదర్శి షేక్ హజరత్ అలీలు ప్రసాద్ చంద్రను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.