సీఎంకు స్వాగతం పలికిన మైదుకూరు ఎమ్మెల్యే
కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణ ఉత్సవానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విమానాశ్రయంలో బుధవారం ఘనంగా స్వాగతం లభించింది. ఈ సందర్భంగా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.