రైతుల కోసం గడుపు పొడిగింపు
NLR: టీపీ గూడూరు మండలంలోని 22 పంచాయతీల రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సాదా బైనామాల ద్వారా కొనుగోలు చేసిన వ్యవసాయ భూములను క్రమబద్ధీకరించుకోవడానికి గడువును జూన్ 30 వరకు పొడిగించింది. తహశీల్దార్ సుధీర్ గురువారం ఈ విషయాన్ని సూచిస్తూ, గ్రామ సచివాలయం లేదా మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.