ఇష్టానుసారంగా రోడ్డు పక్కన పడేస్తున్న వ్యర్ధాలు

KMM: ఖమ్మం కొత్త బస్టాండ్ వద్ద ఉన్న ఓ హోటల్ నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యర్థాలను రోడ్డు పక్కన పడవేస్తున్నారని స్థానికులు తెలిపారు. దీని కారణంగా పరిసరాలు అపరిశుభ్రంగా తయారు కావడమే కాకుండా, వ్యర్ధాలను తినేందుకు వస్తున్న వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ, ప్రయాణికులను పరుగులు పెట్టిస్తున్నాయని చెప్పారు. మున్సిపాలిటీ అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు.