'గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి'
JGL: గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జడ్పీ సీఈవో గౌతమ్ రెడ్డి అన్నారు. రాయికల్ ప్రభుత్వ పాఠశాలలో ప్రిసైడింగ్ అధికారులకు సోమవారం జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చి ఎన్నికలను ప్రశాంతగా నిర్వహించి తిరిగి వాటిని స్ట్రాంగ్ రూములకు చేర్చడం వరకు ప్రిసైడింగ్ అధికారుల బాధ్యత అన్నారు.