VIDEO: ఇందిరమ్మ ఇళ్ళను ప్రారంభించిన ఇన్‌ఛార్జ్ కలెక్టర్
SRCL: తంగళ్ళపల్లిలో ఇందిరమ్మ నమూనా గృహాన్ని సిరిసిల్ల ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరీమ అగ్రవాల్ ఇవాళ ఉదయం ప్రారంభించారు. అనంతరం మండలంలోని మండేపల్లి, రాళ్లపేట, అంకిరెడ్డిపల్లి, కస్బే కట్కూరులోని పూర్తయిన ఇళ్లను సైతం ప్రారంభించారు. తదుపరి మండల కేంద్రంలో నూతన ఎమ్మార్వో కార్యాలయాన్ని పరిశీలించి, అనంతరం నమూనా గృహ ఆవరణలో మొక్కలను నాటారు. అధికారులు, నాయకులు పాల్గొన్నారు.