'సంక్షేమ పథకాల్లో వికలాంగులకు అవకాశం కల్పించాలి'
WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని స్థానిక గ్రంథాలయం ఆవరణంలో ఇవాళ ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా వీహెచ్‌పీఎస్ (VHPS) ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం వీహెచ్‌పీఎస్ మండల అధ్యక్షుడు పులి రమేష్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన జీవో- 5 ప్రకారం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల్లో వికలాంగులకు అవకాశం కల్పించాలని అన్నారు.