గ్రామ అభివృద్ధియే ప్రథమ లక్ష్యం

గ్రామ అభివృద్ధియే ప్రథమ లక్ష్యం

VKB: చౌడాపూర్ మండలం మందిపల్ గ్రామంలోని 8వ వార్డులో గ్రామపంచాయతీ నిధులతో చేపట్టిన అండర్ డ్రైనేజీ పనులను గ్రామ సర్పంచ్ నాగరాజు యాదవ్ ప్రారంభించారు. గ్రామ అభివృద్ధి కోసం అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ నడ్డి మనీషా, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.