PKBS vs GT: పవర్ ప్లే పూర్తి.. వికెట్ డౌన్

PKBS vs GT: పవర్ ప్లే పూర్తి.. వికెట్ డౌన్

IPL 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తన తొలి వికెట్ కోల్పోయింది. 37 పరుగుల వద్ద మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో (3.4) శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి సాయి సుదర్శన్ (13) వెనుదిరిగాడు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి స్కోర్ 54/1గా ఉంది. ప్రస్తుతం క్రీజులో గిల్ (28*), జోస్ బట్లర్ (11*) ఉన్నారు.