ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే
కృష్ణా: గుడివాడ షాహి మసీదులో రంజాన్ మాసం సందర్భంగా నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సోమవారం పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు ఆయన స్వయంగా భోజనం వడ్డించారు. రంజాన్ మాసం మానవతా భావం, సహనం,దానధర్మాలకు ప్రతీక అని ఎమ్మెల్యే అన్నారు. అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవంతో, సౌహార్దంతో కలిసి జీవించడం సమాజానికి ఎంతో అవసరమని ఆయన తెలిపారు.