ఎన్నికల షెడ్యూల్‌తో సందడి మొదలు
SRPT: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో సూర్యాపేటలో ఎన్నికల సందడి మొదలైంది. మున్సిపాలిటీలోని 48వార్డుల్లో 1,08,848 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 52,170, మహిళలు 56,664 మంది, 14 ఇతర ఓటర్లు ఉన్నారు. ఛైర్‌పర్సన్ పీఠం జనరల్ అయ్యింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీలతో పాటు వామపక్షాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.