మేడారం పనులను పరిశీలించనున్న మంత్రి
MLG: మేడారం మహాజాతర ఏర్పాట్లలో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి సీతక్క ఈరోజు పరిశీలించనున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ప్రొటోకాల్కు దూరంగా ఈ పర్యటన కొనసాగనుంది. గద్దెల విస్తరణ,రోడ్లు తదితర నిర్మాణాలను సీతక్క క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అక్కడే అధికారులకు సూచనలు చేస్తారని పార్టీ కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు.