పుంగనూరులో మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు
CTR: పుంగనూరు పట్టణంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం స్థానిక ఎన్టీఆర్ కూడలిలో కేక్ కట్ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ దేశాధి ప్రకాష్ మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తన ఆకాంక్షగా లోకేష్ భావిస్తున్నారని చెప్పారు.