'అజిలిటాస్' బ్రాండ్ అంబాసిడర్‌గా కోహ్లీ
విరాట్ కోహ్లీ 'అజిలిటాస్' (స్పోర్ట్స్‌వేర్, ఫుట్ వేర్) బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. ఇందుకోసం 'పూమా' ఆఫర్ చేసిన రూ.300 కోట్లను కూడా వదులుకుని, ఆ సంస్థతో తన ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు. అయితే, కోహ్లీ గతంలోనే రూ.40cr అజిలిటాస్‌లో పెట్టుబడి పెట్టాడు. ఇకపై విరాట్ సొంత బ్రాండ్ 'ONE8' ఉత్పత్తులు దీని ద్వారానే అందుబాటులోకి రానున్నాయి.