నిబంధనల ఉల్లంఘనపై బస్సులకు జరిమానాలు
కర్నూలు జిల్లాలో కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై రవాణా శాఖ కఠిన చర్యలు చేపట్టింది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 5 వరకు 1178 బస్సులను తనిఖీ చేసి 188 కేసులు నమోదు చేశారు. పత్రాలు లేని 6 బస్సులను సీజ్ చేసి, నిబంధనలు పాటించని యాజమాన్యాలకు రూ.35.12 లక్షల జరిమానాలు విధించినట్లు డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ శాంతా కుమారి ఇవాళ తెలిపారు.