VIDEO: మచిలీపట్నంలో ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ

కృష్ణా: మచిలీపట్నంలో కోనేరు సెంటర్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు బీజేపీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ బుధవారం నిర్వహించారు. స్వాతంత్ర ఉద్యమ త్యాగాలను స్మరించుకుని, ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కన్వీనర్ ఏలూరి పవన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకట గజేంద్ర పాల్గొన్నారు.