VIDEO: సమస్య పరిష్కరించాలని మున్సిపాలిటీ ఎదుట ధర్నా
ATP: గుత్తి మున్సిపాలిటీలోని పై మాల వీధిలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కాలనీవాసులు మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కాలనీవాసులు వెంకటేష్, మల్లికార్జున మాట్లాడుతూ.. కాలనీలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని తక్షణమే తాగునీటి సమస్య పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.