సి.బెళగల్ మండలంలో గడ్డి వాములకు నిప్పు

సి.బెళగల్ మండలంలో గడ్డి వాములకు నిప్పు

KRNL: సి.బెళగల్ మండలం చింతమానుపల్లె గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. మూడు గడ్డి వాములకు గుర్తు తెలియని వ్యక్తులు గురువారం నిప్పు పెట్టారు. గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు రూ.లక్ష నష్టం జరిగిందని బాధితులు వాపోయారు.