వాహనదారులకు అలర్ట్.. నేటి నుంచి కొత్త రూల్స్..!
BDK: నేషనల్ హైవేలపై ఓవర్ లోడ్‌తో వెళ్లే వాహనాలకు కేంద్రం నేటి నుంచి కొత్త టోల్ రూల్ అమలు చేయనుంది. పరిమితికి మించి వాహనం మోసుకెళ్లే అదనపు బరువును బట్టి ఫైన్ విధించనుంది. ఓవర్ లోడ్ 10%లోపు ఉంటే ఎలాంటి ఫైన్ ఉండదు. 10-40% ఉంటే సాధారణ టోల్ రేటుకు 2 రెట్లు, 40%+ ఉంటే 4 రెట్లు ఎక్కువగా చెల్లించాలి. కేవలం ఫాస్టాగ్ ద్వారా దీనిని వసూలు చేస్తారు.