నంది రిజర్వాయర్లో నీటి నిలువ తగ్గుముఖం
PDPL: ధర్మారం మండలం నంది మేడారంలోని నంది రిజర్వాయర్లో నీటి నిలువ తగ్గిపోయింది. అధికారులు రిజర్వాయర్ లోని నీటిని ఎగువనగల లక్ష్మీపూర్ రిజర్వాయర్‌కు అధిక మొత్తంలో తరలించడంతో రిజర్వాయర్‌లో కనీస సామర్థ్యాన్ని కన్నా నీటి నిలువ తగ్గిపోయి, భూభాగం తేలింది. దీంతో గ్రామంలో భూగర్భ జలాలు తగ్గి, మిషన్ భగీరథ నీటి సరఫరాకు కొరత ఏర్పడుతుందని స్థానికులు పేర్కొన్నారు.