విద్యుత్ సరఫరా లేక ఇబ్బందులు

కోనసీమ: అయినవిల్లి మండలం కె. జగన్నాధపురం గ్రామం వెంకాయమ్మపేటలో రెండు రోజుల నుంచి రాత్రి సమయాలలో విద్యుత్ సరఫరా సరిగ్గా ఉండడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులకు సమాచారం అందించినా సరిగ్గా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు అంటున్నారు. లైన్‌మెన్ వచ్చి బాగు చేసినా కాసేపటికే కరేంట్ పోతుందని చెప్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ మార్చాలని కోరుతున్నారు.