VIDEO: గుండె ఆపరేషన్ ఆర్థిక సాయం కోసం ఎదురుచూపు
GDWL: గద్వాల మండలం నీలహళ్లిలో బోయ ఆంజనేయులు అనే వ్యక్తి కుమారుడు సురేందర్‌కు గతంలో గుండె ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం మరోసారి గుండె ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారు. ఈ ఆపరేషన్ ఖర్చు రూ.12 లక్షల వరకు అవుతుందని వైద్యులు చెప్పారని ఆయన అన్నారు. తన దగ్గర ఉన్న 1 ఎకరం పొలాన్ని తాకట్టు పెట్టి వైద్యం అందిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దాతలు సహాయం కోసం ఎదురుచూస్తున్నామన్నారు.