మహిళల విద్యాభివృద్ధికి NIOS పరీక్షా అవసరం: DRDO
ADB: గ్రామీణ మహిళలకు విద్యపై అవగాహన, విద్యాభివృద్ధి కోసం NIOS పరీక్షా ఎంతో అవసరమని డీఆర్డీఓ పీడీ రాథోడ్ రవీందర్ అన్నారు. ఆదివారం నార్నూర్ మండలంలోని గోండుగూడ TWPS పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అనంతరం అక్కడ కల్పించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో APM జాడి రాజారామ్, SHG సభ్యులు, తదితరులున్నారు.