యూరియా బుకింగ్ రద్దుకు డిమాండ్
KNR: వెన్నంపల్లి సహకార సంఘం మహాసభలో యూరియా బుకింగ్ విధానాన్ని రద్దు చేయాలని మాజీ ఛైర్మన్ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. పాత పద్ధతిలోనే యూరియాను పంపిణీ చేయాలని ఆయన కోరారు. ఈ విధానంపై మహాసభలో తీర్మానం చేయాలని ఇన్‌ఛార్జ్ ఛైర్ పర్సన్ శ్రీనివాసులు సూచించారు. రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం వెంటనే స్పందించి పాత విధానాన్ని పునరుద్ధరించాలని అన్నారు.