ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలకు శుభవార్త

నంద్యాల: బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు, భవనాల శాఖ కేటాయించారు. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందంటూ ప్రతిపక్ష హోదాలో టీడీపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. అధికారంలోకి వస్తే రోడ్లను బాగు చేస్తామని పేర్కొంది.