'ROKOకు గంభీర్ క్రెడిట్ ఇవ్వలేదు'
సౌతాఫ్రికాతో ODI సిరీస్‌లో రోహిత్(57, 14, 75), కోహ్లీ(135, 102, 65*) తమ ఆటతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్ విజయం తర్వాత కోచ్ గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ROKOకు ఎలాంటి క్రెడిట్ ఇవ్వలేదని మాజీ ప్లేయర్ రాబిన్ ఉతప్ప విమర్శించాడు. ROKO జోడీ తమ ఆటపై వస్తున్న సందేహాలను చక్కని ప్రదర్శనతో చెక్ పెట్టిందని, టీమిండియాకు ఏం చేయగలదో చూపించిందన్నాడు.