BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మృతి

BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మృతి

HYD: BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంపాల పద్మారెడ్డి క్యాన్సర్‌తో కొంతకాలంగా బాధపడుతూ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయక్ తెలిపారు. అంపాల పద్మారెడ్డి BJPకి విశేష సేవలు అందించిన నాయకులుగా గుర్తింపు పొందారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్, పలువురు BJP, BRS, కాంగ్రెస్ పార్టీ నేతలు నివాళులు తెలిపారు.