గుండెపోటుతో ఐద్వా జిల్లా కార్యదర్శి మృతి
KNR: సీపీఎం సీనియర్ నాయకురాలు, అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కార్యదర్శి లంకా జమున శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఆమె పార్టీ పట్టణ కమిటీ సభ్యురాలుగా కూడా పనిచేశారు. ఆమె మృతి పట్ల పార్టీ నాయకులు సంతాపం ప్రకటించారు. ఆదిలాబాద్ పట్టణంలోని రణదీవేనగర్‌లో సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.