VIDEO: పార్కు ఆవరణలో పాము కలకలం
BDK: కొత్తగూడెం టౌన్ రామచంద్ర డిగ్రీ కాలేజ్ పార్కులో పిచ్చి మొక్కలు పెరగడంతో విష సర్పాలు సంచరిస్తున్నాయని స్థానికులు సోమవారం వెల్లడించారు. పార్కు అభివృద్ధికి కోటి రూపాయలు మంజూరైనా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇవాళ పిచ్చి మొక్కల్లో నుంచి రక్తపింజర బయటికి రావడంతో స్థానికులు భయాందోళన గురైనట్లు తెలిపారు.