షేర్ల లాభం పేరిట భారీ మోసం
AP: కృష్ణా జిల్లా కానూరుకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ అధికారి విద్యానంద్‌ను సైబర్ మోసగాళ్లు షేర్ల పెట్టుబడి పేరిట రూ.55.20 లక్షలు దోచుకున్నారు. ఫేస్‌బుక్ ప్రకటన చూసి వాట్సాప్ గ్రూపుల్లో చేరిన ఆయనకు, భారీ లాభాలు వచ్చినట్లు నమ్మించి ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో అదనపు నగదు వసూలు చేశారు. చివరకు మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.