సొంతంగా వంతెన నిర్మాణం చేపడుతున్న గిరిజనులు
ASR: అరకులోయ మండలం మెచ్చగూడ గ్రామ ప్రజలు బ్రిడ్జి నిర్మాణంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నోసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు దరఖాస్తులు సమర్పించినా ఇప్పటికీ స్పందన లేదని తెలిపారు. రాకపోకలకు కీలకమైన బ్రిడ్జి లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. ఎవ్వరు స్పందించకపోవడంతో తామే స్వచ్ఛందంగా బ్రిడ్జి నిర్మాణాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు.