VIDEO: ప్రమాణ స్వీకారం వాయిదా – ఛైర్మన్ రేసులో అంతర్గత పోటీ
MHBD: డోర్నకల్ మున్సిపాలిటీలో నేడు జరగాల్సిన నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడింది. కౌన్సిలర్లు నిర్ణీత సమయానికి హాజరుకాకపోవడంతో కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్ పదవికి ముగ్గురు కౌన్సిలర్లు ఆశావహులుగా ఉండటంతో అంతర్గత పోటీ తీవ్రంగావుంది. ఈనేపథ్యంలో పార్టీహైకమాండ్ జోక్యంతో రేపటికి వాయిదా పడింది.