పోలీస్ స్టేషన్ నూతన భవనానికి భూమిపూజ
NZB: ముప్కాల్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ నూతన భవన నిర్మాణానికి బుధవారం ఏసీపీ వెంకటేశ్వర్ భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై కిరణ్ పాల్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కట్ట మహేష్, సర్పంచ్ సాయమ్మ, ఉప సర్పంచ్ చిన్నయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, పలు పార్టీ నాయకులు పాల్గొన్నారు.