శ్రీ అంకాళమ్మను దర్శించుకున్న మాజీ మంత్రి
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని మూలపాడులో శ్రీ అంకాళమ్మ తల్లి 12వ జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి , వైసీపీ ఇంఛార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు ఆదివారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మాజీ మంత్రికి ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. దర్శనానంతరం అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు.