సంగమేశ్వర స్వామి ఆలయం వద్ద బందోబస్తు
AP: రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల వద్ద తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రేపు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ప్రముఖ ఆలయాల వద్ద రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో పోలీసులు ముందస్తు చర్యలను చేపట్టారు. నెల్లూరు జిల్లాలోని సంగమేశ్వరస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలొస్తారని అంచనా వేశారు. భక్తుల భద్రత దృష్ట్యా బందోబస్తు ఏర్పాటు చేశారు.