గొడవలు జరగకుండా చూసేందుకు చర్యలు

గొడవలు జరగకుండా చూసేందుకు చర్యలు

చిత్తూరు: జూన్ 4న వెలువడనున్న ఎన్నికల ఫలితాల నేపథ్యంలో, గ్రామాల్లో పార్టీల పేరుతో గొడవలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు ముదివేడు ఎస్సై మల్లికార్జున రెడ్డి తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ పార్టీల పేరుతో గ్రామాల్లో గొడవలు జరగకుండా చూడాలని జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాలతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా శనివారం పోలీస్ టికెట్ ఏర్పాటు చేశారు.