పుట్టపర్తిలో అంగరంగ వైభవంగా రథోత్సవం

పుట్టపర్తిలో అంగరంగ వైభవంగా రథోత్సవం

సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో భాగంగా పుట్టపర్తిలో రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సత్యసాయి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ దంపతులు, రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్, సవితలు ఈ వేడుకను ప్రారంభించారు. సాయి నామస్మరణతో పుర వీధులు మార్మోగాయి.