రైతుల ప్రగతి కోసం ప్రభుత్వం కృషి: జీవీ
AP: రైతు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు. అందుకోసమే రైతుల ప్రగతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అన్నదాతల తలసరి ఆదాయాన్ని గణనీయంగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా డిమాండ్ ఉన్న పంటల సాగు వైపు రైతులు మళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.