VIDEO: రన్నింగ్‌లో చక్రం ఊడి.. కారును ఢీ

RR: హయత్‌నగర్ నుంచి తొర్రూరు వెళ్లే రోడ్డులో ఆదివారం శ్మశాన వాటిక సమీపంలో ఆటో ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న ఆటో ముందు చక్రం విరిగిపోవడంతో, అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఒక మహిళా ప్రయాణికురాలు గాయపడింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కారణంగా ఆ ప్రాంతంలో కొద్దిసేపు ట్రాఫిక్‌కు నిలిచిపోయింది.