'రైతులకు రూ.10 వేలు నష్టపరిహారం ఇవ్వాలి'

'రైతులకు రూ.10 వేలు నష్టపరిహారం ఇవ్వాలి'

GNTR: అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులు, కౌలు రైతులకు ప్రభుత్వం రూ.10 వేలు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతు సంఘ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. తెనాలి మండలం నందివెలుగులోని గ్రామ సచివాలయంలో వినతి పత్రం అందజేశారు. భారీ వర్షాల వల్ల వేలాది ఎకరాలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం జరిగిందని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి అన్నారు.