ముఖ హాజరుతో గిరిజనుల ఇబ్బందులు
ASR: అరకులోయ మండలం సిరగం పంచాయతీ దిబ్బవలస గ్రామంలో ముఖ హాజరుతో పని ప్రదేశంలో బుధవారం ఉపాధి కూలీలు అవస్థలు పడుతున్నారు. ముఖ హాజరు రద్దు చేయాలని, దీని కొరకే కూలీలు చాలా సమయం కేటాయించాల్సి వస్తుందని గిరిజన సంఘం మండల నాయకులు ఎస్. ఐసుబాబు తెలిపారు. మన్య ప్రాంతంలో చాలా గ్రామాలలో నెట్ సిగ్నల్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.